పుత్తూరు: అంతర్జాతీయ పోటీలకు ఉన్నత పాఠశాల విద్యార్థి

594చూసినవారు
పుత్తూరు: అంతర్జాతీయ పోటీలకు ఉన్నత పాఠశాల విద్యార్థి
చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలోని మెయిన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న జి. విజయ్, ఇటీవల తమిళనాడులో జరిగిన అండర్ 12 నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్ పోటీలలో ద్వితీయ బహుమతి సాధించి అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాలలో విజయ్ కు అభినందన సభ నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పాఠశాల హెచ్ఎం శశికళ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్