నగరి నియోజకవర్గం, పుత్తూరులో కావమ్మ తిరునాళ్లు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.