నగరి నియోజకవర్గం, పుత్తూరు అర్బన్ నూతన ఎస్సైగా నాగేంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుత్తూరు పట్టణ, రూరల్ ప్రాంతాలలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. జూదం, అక్రమ మద్యం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.