పుత్తూరు పట్టణం స్వామీ వీధిలోని శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక ఆలయంలో గురువారం సంకటహర చతుర్థిని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు భక్తుల సహకారంతో అన్నదానం జరిగింది. సాయంత్రం 5 గంటలకు స్వామివారికి అభిషేకాలు, 6 గంటలకు సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారని కమిటీ సభ్యులు తెలిపారు.