చిత్తూరు జిల్లా నగరి మండలం నెత్తం కండ్రిగ ఉన్నత పాఠశాలలో మంగళవారం పేరెంట్స్ కమిటీ
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించారు. ఎన్నికైన 15 మంది సభ్యులలో చైర్మన్ గా పద్మావతి, వైస్ చైర్మన్ గా దుర్గ ఎన్నికైనట్లు హెచ్ఎం ఉమా శంకర్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన పేరెంట్స్ కమిటీ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని, అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని కమిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.