నగరిలో శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా పలు ఆలయాల్లో వైభవంగా ఉత్సవాలు జరిగాయి. భేరివీధి కోదండరామాలయం, పాతభజనగుడి వీధి రామాలయం, కొత్తపేట కోదండరామాలయం, దిగువ అయనంబాకం, ఎగువ అయనంబాకం, మేళపట్టు శ్రీరామాలయం, రాజుల కండ్రిగ రామాలయాల్లో ప్రత్యేక పూజలు, రామాయణ పారాయణం, సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వాముల విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయంలో ఉగాది తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగగా శ్రీరామనవమిని భావిస్తారు.