
నగరి: సీఎం ను కలిసిన ఎమ్మెల్యే భాను
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలు పొందుతున్న లబ్ధి వంటి అంశాలను సీఎంకు వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేకి పలు ముఖ్య సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు.






































