
నగరి: రానున్న రోజుల్లో నైపుణ్యం పెరగాలి
రానున్న రోజులలో రైతులు చేసే వ్యవసాయంలో నైపుణ్యం మరియు ఉత్పత్తులు పెరగాలని నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు. మంగళవారం వడమాలపేట మండలం, టిసి అగ్రహారంలో నిర్వహించిన 'రైతన్నా-మీకోసం - అన్నదాత- సుఖీభవ' కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




































