
నగరిలో దీపావళి నాడు సామూహిక కేదారేశ్వర గౌరీ నోములు
నగరి నియోజకవర్గం, నిండ్ర మండలం, కూనమరాజుపాళెంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం దీపావళి అమావాస్య సందర్భంగా సామూహికంగా కేదారేశ్వర గౌరీ నోములు చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారిని అలంకరించి గణపతి పూజ, కలశ స్థాపన, తోరపూజ, అభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రూపేష్ క్రిష్ణ ఆచార్య శాస్త్రోక్తంగా వ్రతకథ చదివి వినిపించి, షడ్రుచులతో నైవేద్యం సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు.








































