
నెల్లూరు: అర్ధరాత్రి నుంచి అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ మూసివేత
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ ను శుక్రవారం అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు కమిషనర్ వై. ఓ నందన్ ప్రకటించారు. తూర్పు, పడమర ప్రాంతాలను అనుసంధానించే ఈ ప్రధాన ఫ్లైఓవర్ ను ఆధునికీకరించేందుకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ పనులు వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు కొనసాగుతాయని, ఆ తర్వాత ఫ్లైఓవర్ ను తిరిగి అందుబాటులోకి తెస్తారని కమిషనర్ వివరించారు.





































