
నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబుతో గిరిధర్ రెడ్డి భేటీ
గురువారం నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించి, నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.





































