
జనసేన ఆధ్వర్యంలో భోగి పండుగ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండవ సంక్రాంతి పండుగ అని, ఈ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు ఆకాంక్షించారు. మంగళవారం రాత్రి నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన నగర కార్యాలయంలో భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా సుజయ్బాబు, జనసేన నాయకులు, వీర మహిళలతో కలిసి భోగి మంటలు వేయగా, వివిధ నియోజకవర్గాల జనసేన ఇన్చార్జీలు పాల్గొన్నారు.







































