ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి: వైఎస్సార్సీపీ బీసీ యువనాయకుడు

684చూసినవారు
ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి: వైఎస్సార్సీపీ బీసీ యువనాయకుడు
వైఎస్సార్సీపీ బీసీ యువనాయకుడు డా.యం.డి.హెచ్.పవన్ కళ్యాణ్, పత్రికా రంగంలోనే విలువైన ఏబీఎన్ రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ నాయకుల భార్యల పట్ల అసభ్యకరంగా, నీచంగా మాట్లాడి వారిని కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన ఈ ఘటనపై స్పందిస్తూ, ఏబీఎన్ రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనల నేపథ్యంలో, ఏబీఎన్ రాధాకృష్ణ వైసీపీ నాయకులను అవహేళన చేస్తూ, 'జగన్ చెప్తే వైసీపీ నాయకులు వారి భార్యలు కూడా కాదని చెప్తారు' అని నీచంగా మాట్లాడటం పత్రికా రంగానికే అవమానమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్