చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి-1 అంగన్వాడీ కేంద్రంలో శనివారం అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయచంద్ర, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లులు, యుక్తవయసు బాలికలు పాల్గొన్నారు. పోషకాహార లోపాల నివారణ, ఆహారంలో వైవిధ్యం, విటమిన్లు కోల్పోకుండా వంట చేసే విధానం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడంపై అవగాహన కల్పించారు. సామాజిక భాగస్వామ్యంతో పోషకాహారంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు డాక్టర్ విజయచంద్ర తెలిపారు.