చిత్తూరు జిల్లా పలమనేరులోని బైరెడ్డిపల్లి–2 అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం సీడీపీఓ యు. అరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వడం, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే అందించడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు మేధో వికాసం మెరుగుపడుతుందని వివరించారు. తల్లిపాలు తల్లికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని, ముర్రుపాలు శిశువుకు తొలి టీకాలుగా పనిచేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ మాధవీలత, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్త్ ఎడ్యుకేటర్ సావిత్రి పాల్గొన్నారు.