చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం

2చూసినవారు
చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం
చిత్తూరు జిల్లాలో కరువు పరిస్థితులను పరిశీలించేందుకు సీపీఎం రాష్ట్ర కరువు బృందం పలమనేరు ప్రాంతంలో పర్యటించింది. పెగరగుంట కొత్తచెరువు ఎండిపోవడంతో 200 ఎకరాల ఆయకట్టు బీడుగా మారిందని, గంగవరం మండలం మరుమాకులపల్లిలో టమోటా, వేరుశెనగ పంటలు నష్టపోయాయని బృందం తెలిపింది. సీపీఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు రూ. 50 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్