క్షుద్ర పూజలపై ఎస్పీకి ఫిర్యాదు
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఎం. కోటూరు గ్రామంలో నివాసాల మధ్య ఖాళీ స్థలంలో క్షుద్రపూజలు చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిపై గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న ఆ వ్యక్తి క్షుద్రపూజలు చేస్తూ, ప్రజలను తమ గుప్పెట్లో ఉంచుకోవాలని చూస్తున్నాడని, ప్రశ్నించిన వారిపై ఇలాంటి ప్రయోగాలు చేస్తూ హింసిస్తున్నాడని బాధితులు తెలిపారు. అధికారులు పట్టించుకోవడం లేదని, తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.