కారును ఢీకొట్టి బోల్తా పడిన కంటైనర్ లారీ

4802చూసినవారు
కారును ఢీకొట్టి బోల్తా పడిన కంటైనర్ లారీ
చిత్తూరు జిల్లా పలమనేరులో బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై గురువారం కంటైనర్ లారీ బోల్తా పడింది. ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో కారును ఢీకొన్న లారీ, దానిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, డ్రైవర్ అతివేగం, మద్యం సేవించి ఉండటం వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

సంబంధిత పోస్ట్