చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండలంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. గోనమోకుల పల్లె, కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆయన పర్యటించి, రూ.2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కృష్ణాపురం టోల్ గేట్ వద్ద జనసైనికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గోనమాకుల పల్లె ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం, గోనమాకుల పల్లె నుంచి ఎస్.బండపల్లి వరకు రూ.31 లక్షలతో, అలాగే గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.