బైరెడ్డిపల్లి మండలంలో మాయమవుతున్న చెరువులు

528చూసినవారు
పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలంలో చెరువులు, వాగులు, వంకలు కబ్జాలకు గురవుతున్నాయని స్థానిక రైతులు శనివారం తెలిపారు. నెల్లిపట్ల పంచాయతీ పరిధిలోని కొన్ని చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, ఇలాంటి పరిస్థితి ఇతర పంచాయతీల్లో కూడా కనిపిస్తోందన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి చెరువులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఆక్రమణల వల్ల నీటి వనరులు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్