సేవారత్న డాక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ 'ఐ' హాస్పిటల్, పలమనేరు పరిధిలోని గంటా ఊరు తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనుంది. నిర్వాహకులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిబిరం ఆదివారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.