పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం దండపల్లి కురప్పల్లిలో అమ్మాయి కోసం వెళ్లి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. బంగారుపాళ్యం మండలం కురప్పల్లికి చెందిన జయదీప్ ను ఈ నెల 3న స్నేహితులు అమ్మాయి పిలుస్తోందని బైక్పై తీసుకెళ్లారు. జయదీప్ తో వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఎక్కడని మృతుడి తమ్ముడు లోకేష్, కుటుంబ సభ్యులు శనివారం ప్రశ్నించారు. ఈ ఘటనపై తాము ఈ నెల 7న ఫిర్యాదు చేశామని, కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు.