పెద్దపంజాణి మండలం కొలతూరు పంచాయతీ గుండ్లపల్లికి చెందిన సునీల్ రెడ్డి, పలమనేరు పోలీస్ స్టేషన్ కు నేరాలను అరికట్టడానికి తన వంతు సహకారంగా ఒక డ్రోన్ కెమెరాను వితరణగా అందజేశారు. ఈరోజు డీఎస్పీ ప్రభాకర్ చేతుల మీదుగా పోలీసులు ఈ డ్రోన్ ను స్వీకరించారు. దీని ద్వారా నేరాల నియంత్రణలో పోలీసులకు మరింత సహాయం లభించనుంది.