గంటాపూర్ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు

152చూసినవారు
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటాపూర్ చెరువులో జెసిబిలతో అక్రమంగా మట్టి తవ్వకాలు ఆదివారం జరిగాయి. ఈ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల చెరువుల్లోనూ ఇలాగే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్