పలమనేరు స్మశాన వాటికల అభివృద్ధికి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి హామీ

519చూసినవారు
పలమనేరు మున్సిపల్ పరిధిలోని ఒడ్డివాని కుంట, మదనపల్లి రోడ్డులో ఉన్న స్మశాన వాటికలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు, వీరశైవ లింగాయత్ సంఘ నాయకులు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. స్మశాన వాటికలలో ప్రహరీ గోడ, బోర్‌వెల్, నీటి ట్యాంకు, మరుగుదొడ్లు, నిత్యకర్మలు నిర్వహించేందుకు షెల్టర్ వంటి కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించే దిశగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, బాలాజీ, సురేష్, కృష్ణప్పతో పాటు వీరశైవ లింగాయత్ సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్