పుంగనూరు టీడీపీ సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి కీలక సూచనలు

1చూసినవారు
పుంగనూరు టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ రెడ్డి పాల్గొన్నారు. అక్టోబర్ 2న మదనపల్లిలో జరగనున్న హార్టికల్చర్ కార్యక్రమం ఏర్పాట్లపై ఆయన పలు సూచనలు చేశారు. రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్