ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు..ఎమ్మెల్యే

475చూసినవారు
పలమనేరు నియోజకవర్గం వి.కోట మండల తహసీల్దార్ సూరప్రకాశ్ నాయక్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఆయనతో శనివారం సమావేశమయ్యారు. ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని, భూ వివాదాలు, పట్టాదారు పాస్‌బుక్లు, మ్యూటేషన్లు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాల జారీ వంటి అంశాల్లో వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సంక్షేమానికి సమన్వయంతో పనిచేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్