పలమనేరులో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు

2697చూసినవారు
పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి, కేక్‌లు కట్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పేదలకు అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పలమనేరు పట్టణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న ఉపాధి కూలీలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యే నాయకత్వంలో పలమనేరు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్