పలమనేరు మండలంలోని కొలమాసనపల్లికి చెందిన ఒక మాజీ సైనికుడికి చెందిన భూమిని, ఆయన మరణానంతరం అతని సంతానానికి ఇవ్వకుండా ఇతరులకు కట్టబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విఆర్ఓ నుండి ఆర్డీఓ వరకు అధికారులు లంచం తీసుకున్నారని, దేశ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని బాధితులు గోవిందప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ ఓ ఆర్ అప్పీల్ వరకు వెళ్లినా న్యాయం జరగలేదని, ఇది దేశ సైనికులకు ఇచ్చే గౌరవమా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై అధికారులపై ఫిర్యాదు చేశారు.