మీ-సేవ కేంద్రాల్లో ప్రభుత్వ నిర్దేశిత రుసుముల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని పలమనేరు పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం పలమనేరు ఆర్డీఓకు మెమోరాండం సమర్పించి, ప్రతి మీ-సేవ కేంద్రంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికలను ఏర్పాటు చేసి, అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని కోరింది. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు నరసింహులు, కార్యదర్శి నారాయణ, కోశాధికారి రామచంద్ర, సలహాదారు శ్రీపురం సీతారామయ్య, ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్ రెడ్డి, రెడ్డప్ప నాయుడు, విజయ్‌కుమార్, సాంబయ్య, జగన్నాథం, నాగప్ప, చంద్రశేఖరయ్య, వీరభద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.