పలమనేరు: క్రికెట్ బెట్టింగ్ కు ఒక నిండు ప్రాణం బలి... డి. ఎస్పి

675చూసినవారు
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడని, ముగ్గురు హంతకులుగా మారారని డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. బుధవారం పలమనేరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద పంజాణి మండలం, ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ దగ్గర అప్పు తీసుకున్న సుబ్రహ్మణ్యం, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను హత్య చేశాడని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశామని, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్