పలమనేరులో రెండు రోజులుగా దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీని కారణంగా వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాల భయం నెలకొంది. ఉదయం 8 గంటలైనా పొగమంచు తగ్గకపోవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జనజీవనం స్తంభించిపోయింది.