పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై తీవ్రంగా మండిపడ్డారు. పలమనేరులో మాట్లాడుతూ, పత్రికలు ఉన్నది ఉన్నట్లుగా వార్తలు ప్రచురించాలని, ఇష్టానుసారం వార్తలు రాయడం సరికాదని ప్రశ్నించారు. రాబోవు రోజుల్లో మహిళలే రాధాకృష్ణకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.