పలమనేరు: ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

549చూసినవారు
గురువారం పలమనేరు నియోజకవర్గం, వీ కోట మండలం, నర్నపల్లి పంచాయతీలో 'మన ఊరికి - మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్. అమరనాథ్ రెడ్డి పర్యటించారు. ఆయన గ్రామంలోని ప్రతి ఇంటినీ సందర్శించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా 14 ఎకరాల భూములకు సంబంధించిన పట్టాల సమస్యపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరగాలని, వెంటనే నివేదిక పంపాలని కలెక్టర్ ను కోరారు.

సంబంధిత పోస్ట్