పలమనేరు ఎంపీడీవో భాస్కర్‌కు జడ్పీ చైర్మన్ ఘన సన్మానం

558చూసినవారు
పలమనేరు ఎంపీడీవో భాస్కర్‌కు జడ్పీ చైర్మన్ ఘన సన్మానం
30 జూన్ 2026న, చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ జీ. శ్రీనివాసులు (వాసు) పలమనేరు ఎంపీడీవో శ్రీ భాస్కర్ పదవీ విరమణ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్ ప్రభుత్వ సేవలో అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ, ఆయన పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.