పలమనేరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బుధవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పురోగతి, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూరల్ మండల పరిధిలో రోడ్డు నిర్మాణంపై అటవీ శాఖ అధికారుల అభ్యంతరాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.