చిత్తూరు జిల్లాలో, పలమనేరు మండలం కూర్మాయికి చెందిన రోషన్ అనే వికలాంగుడు, సోమవారం పిజిఆర్ఎస్ లో కలెక్టర్ కు విన్నవించుకున్నాడు. అధికారులు సదరం సర్టిఫికేట్ అడుగుతున్నారని, ప్రస్తుతం వస్తున్న రూ. 6 వేల పింఛన్ ను రూ. 15 వేలకు పెంచితే తనకు ఆసరాగా ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఈ మేరకు అధికారికి వినతి పత్రం అందించాడు.