పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టెలివిజన్ ఛానెల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న జరిగిన ఈ వ్యాఖ్యలపై ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పలమనేరు పట్టణ పోలీసు స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. మహిళలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించమని ఆయన స్పష్టం చేశారు.