ఈ నెల 6న పలమనేరులో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బీవీఎం శివశంకర్ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పర్యటనలో భాగంగా శుక్రవారం గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ వద్ద ఆమె ర్యాలీ ప్రారంభిస్తారని, పలమనేరు అంబేడ్కర్ సర్కిల్ నుంచి గంటావూరు వరకు ర్యాలీగా వెళ్లి ఉపాధి హామీ కూలీలను కలుస్తారని తెలిపారు.