పలమనేరు నియోజకవర్గంలోని వీకోట పట్టణంలో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచులకు, ఎంపీటీసీలకు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారికి శాలువాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.