పలమనేరు నియోజకవర్గం కొలమాసనపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ వెంకటరత్నం ఆకస్మికంగా మృతి చెందారు. పార్టీకి ఎనలేని సేవలందించిన ఆయన, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యిని నిరసిస్తూ జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఇంటికి వెళ్లి కొద్దిసేపటికి గుండెనొప్పితో బాధపడటంతో, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన నిరసన ర్యాలీలో పాల్గొన్న చిత్రం కూడా ఉంది.