పలమనేరు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం కార్మికులు, ప్రజలు శనివారం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ ఇళ్ల వద్ద తడి, పొడి చెత్తను వేరు చేసి అందజేయాలని సూచించారు. కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, పాఠశాలల్లో కూడా ఇదే పద్ధతి పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, పురపాలక సంఘ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.