చిత్తూరు జిల్లా పలమనేరులోని గంగవరం అంబేద్కర్ భవన్‌లో బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్ అనుబంధ సంఘాల బలోపేతానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం ఆల్
ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పుణ్యమూర్తి చింతమాకుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అసమానతలను రూపుమాపాలంటే బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి. వి. మునిరత్నం, జిల్లా కార్యదర్శి వేళాయుధం, జిల్లా అధ్యక్షులు తరిగొండ, మణి తదితరులు పాల్గొన్నారు.