విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మరణించారని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి. మునిరత్నం, జిల్లా గౌరవ అధ్యక్షులు మణి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై శుక్రవారం పలమనేరు పట్టణంలో మానవ హక్కుల కార్యాలయంలో అమానుల్లా అధ్యక్షతన సమావేశం జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ సంఘటనపై చర్చించారు.