కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని వి. కోట నియోజకవర్గానికి అన్ని అర్హతలు ఉన్నాయని స్థానికులు మంగళవారం తెలిపారు. పాల ఉత్పత్తి, ఉద్యాన పంటల సాగులో జిల్లాలో ముందంజలో ఉన్న ఈ ప్రాంతంలో లక్షకు పైగా జనాభా, వేల ఎకరాల సాగు భూములు, 60 వేలకు పైగా ఓటర్లు, భారీ వ్యవసాయ మార్కెట్ ఉన్నాయని పేర్కొన్నారు. పక్క మండలాలను కలుపుతూ వి. కోటను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని వారు కోరారు.