మామిడి రైతుల పేరుతో వైసీపీ డ్రామాలు: ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

3240చూసినవారు
మామిడి రైతుల పేరుతో వైసీపీ డ్రామాలు: ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి
పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, మామిడి రైతుల పేరుతో వైసీపీ నేతలు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్న సొంత పార్టీ నేత కంపెనీ ఎదుటే నిరసన చేపట్టాలని సవాల్ విసిరారు. మామిడి రైతులను ఆదుకున్న ప్రభుత్వం టీడీపీదేనని, గతంలో కిలోకు రూ.4 ప్రోత్సాహకం ఇచ్చి రూ.261 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఈ ఏడాది కూడా రైతులకు ప్రోత్సాహకం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్