వెంకయ్య నాయుడును కలిసిన భాను ప్రకాష్: ప్రజా సమస్యలపై చర్చ

635చూసినవారు
వెంకయ్య నాయుడును కలిసిన భాను ప్రకాష్: ప్రజా సమస్యలపై చర్చ
చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మరియు పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎల్ భాను ప్రకాష్, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరుపు వెంకయ్య నాయుడును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. భాను ప్రకాష్ మాట్లాడుతూ, వెంకయ్య నాయుడు సనాతన ధర్మానికి ప్రాధాన్యత ఇస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. వెంకయ్య నాయుడు సూచించిన మార్గంలో ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎస్ జగదీశ్వర్ నాయుడు, మాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్