పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు: విగేష్ కుమార్

1618చూసినవారు
పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు: విగేష్ కుమార్
బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించిన బిజెపి మండల అధ్యక్షుడు విగేష్ కుమార్, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకాలను ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని, పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అని అన్నారు. ఈ సందర్భంగా ANMలు, ఆశా వర్కర్లు పిల్లలకు పోలియో చుక్కలు, ఇతర టీకాలు వేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బిజెపి కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్