పూతలపట్టు నియోజకవర్గం, కాణిపాకం పరిధిలోని దళితవాడలో మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ శనివారం పర్యటించి, అక్కడి నివాసితుల జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని కుటుంబాలు కనీసం రూ. 100 కూడా లేకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.