పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, శెట్టేరి గ్రామంలో బుధవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ పాల్గొన్నారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కూటమి ప్రభుత్వం సకాలంలో అందిస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.